అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని గవర్నమెంట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాణ్యం వేణు, ఏలూరు, పశ్చి మగోదావరి జిల్లాల ఏపీ జేఏసీ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, యూవీ పాండురంగారావు డిమాండ్‌ చే శారు. సంఘ ఏలూరు జిల్లాస్థాయి ఉద్యోగుల ఆత్మీ య సమావేశం ఆదివారం స్థానిక జెడ్పీ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై అవగాహన ఉందని వారికి హెచ్‌ఆర్‌ పాలసీని అమలుచేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతాలు ఇవ్వాలని, పని భా రం తగ్గించాలని, 12వ పీఆర్‌సీ అమలు చేసి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పాండు రంగారావు మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ వ్యవస్థకి జీతాలు తక్కువే ఇస్తున్నారన్నారు. ఎన్‌జీఓ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాఽథ్‌ మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను ఆప్కాస్‌ ద్వారా కూడా సరైన విధానంలో భర్తీ చేయడం లేదని, జీతాలు పెంచి సామాజికంగా వారి స్థాయిని పెంచాలని కోరారు. పాణ్యం వేణు మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అతి తక్కువ వేతనానికి అంకితభావంతో పనిచేస్తూ అభద్రతాభావానికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచాలన్నారు.

జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

గవర్నమెంట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అ సోసియేషన్‌ (ఏపీ) ఉమ్మడి పశ్చిమగోదావరి జి ల్లాకు సంబంధించి నూతన కమిటీ ఎన్నికయ్యింది. జిల్లా అధ్యక్షుడిగా నాగభూషణం (గృహనిర్మాణ శా ఖ), జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు (పశుసంవర్ధక శాఖ), మరో 20 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎంపికై న జిల్లా కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement