తాడేపల్లిగూడెం (టీఓసీ): టూ టౌన్ శివారు జయలక్ష్మి థియేటర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు, సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారుల వివరాల ప్రకారం.. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదు. థియేటర్ చాలా కాలంగా మూతపడి ఉందని, కొంతకాలం ఫంక్షన్ హాల్‌గా నడిపారని, ప్రస్తుతం భవనం శిథిలమైందని తెలిపారు. సుమారు రూ. 2 నుంచి 3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.


