అంబటి దీక్షకు మద్దతు | - | Sakshi
Sakshi News home page

అంబటి దీక్షకు మద్దతు

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 7:17 AM

అంబటి దీక్షకు మద్దతు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డీసీఈబీ కార్యదర్శిగా సురేష్‌ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

భీమవరం: గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా నిరసన నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబుకు భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమల్లి వెంకటరాయుడు మద్దతు ప్రకటించారు. అనంతరం దీక్ష నిర్వహించిన రాంబాబుకు శాలువా కప్పి సత్కరించారు.

ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి

భీమవరం: భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యం దరి చేరకుండా చూసుకోవచ్చన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రతినెల మూడో శనివారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్మర్డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ కెవీవీఎన్‌ సత్యనారాయణ, ఆర్మడ్డ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దెందులూరు: జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) కార్యదర్శిగా పి.సురేష్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ ఆ స్థానంలో తడికలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.సర్వేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు. ఆయన మూడు సంవత్సరాల పదవీ కాలం ముగియడంతో, దెందులూరు మండలం మేదినరావుగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సురేష్‌ను నియమించారు. సురేష్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ, ఏలూరు ఉప విద్యాశాఖాధికారి, అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు.

భీమడోలు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ్‌ అన్నారు. జాతీయ రహదారి సూరప్పగూడెం వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు, గోనె సంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని రైతులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నందున ధాన్యం కొనుగోలుకు అవసరమైన నాణ్యమైన సంచులను అందుబాటులో ఉంచామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement