చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 2లో u
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన చేగొండిపల్లి సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి చేరింది. కొత్తూరు, గుంజవరం, మెత్తాపుకోట, చేగొండిపల్లి గ్రామాల పరిధి లోని అభయారణ్య ప్రాంతంలో కదలికలు సాగిస్తోంది. గత ఐదు రోజులుగా పులి కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టి అడుగు జాడలను గుర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపులిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖాధికారి ఎస్‌కే వలీ పేర్కొన్నారు. పులులు సంరక్షణ కేంద్రం నుంచి వచ్చిన సిబ్బందితో పాటు ట్రాన్‌క్విలైజర్ గన్‌మెన్‌లు, రెస్క్యూ బృందాలతో పాటు, ప్రాజెక్టు ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్‌తో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పులికి అమర్చిన రేడియో ట్రాకర్ ద్వారా కదలికలను గుర్తిస్తున్నారు. శుక్రవారం ప్రాజెక్టు సమీప ప్రాంతంలో కనిపించినట్లు వచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో వెళ్లింది. ఒకవేళ మైదాన ప్రాంతానికి చేరుకుంటే పులిని పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.


