పింఛను మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

పింఛను మంజూరు చేయండి

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

పింఛను మంజూరు చేయండి ప్రభుత్వం ఆదుకోవాలి అర్జీ పెట్టుకున్నాను

నాకు బ్రెయిన్‌ స్టోక్‌ వచ్చింది. ఎటువంటి ఆధారం లేని నన్ను వృద్ధాప్యంలో ఉన్న తల్లి చూసుకుంటుంది. బతుకు దెరువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పింఛన్‌ మంజూరు చేసి ఆదుకొవాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను.

– కారుమంచి సీతమ్మ,

రేలంగి

సుగర్‌ వల్ల నా ఎడమ కాలు మోకాలి వరకు తొలగించారు. కుడికాలు కూడా దెబ్బతిని కదలలేని స్థితిలో ఉన్నాను. పింఛను కోసం కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను. ప్రభుత్వం త్వరితగతిన పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలి.

– సానబోయిన సీతామహలక్ష్మి, మల్లిపూడి

ప్రమాదంలో కాళ్లు, చేతులు తీవ్రంగా గాయపడడంతో కదలలేని స్థితిలో ఉంటున్నాను. చూసేవారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను.

– నల్లి అబ్రహం లింకన్‌,

చెరుకువాడ

Advertisement
 
Advertisement
Advertisement