కొల్లేరులో పక్షుల కనువిందు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో పక్షుల కనువిందు

Feb 8 2026 7:13 AM | Updated on Feb 8 2026 7:13 AM

కొల్లేరులో పక్షుల కనువిందు

కొల్లేరులో పక్షుల కనువిందు

పూర్తయిన లెక్కింపు.. తుది జాబితా తయారు

సుమారు 50 లక్షల పక్షులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా

కై కలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్‌ బర్డ్‌ సెన్సస్‌ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(పీసీసీఎప్‌) బీఎన్‌ఎన్‌ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్‌వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్‌ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షులు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్‌ బృందాల సమాచారం మేరకు నార్తర్న్‌న్‌ పిన్‌టైల్‌ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్‌, కామన్‌టీల్‌, గార్కానీ, గాడ్‌వీట్‌, శాండ్‌ పైపర్స్‌, జకానా, ఫిన్‌ టైల్‌, రఫ్‌ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది.

గణన జరిగిన ప్రాంతాలు ఇవే..

కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవికొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement