భీమవరం రైల్వే కాలనీలో చోరీ
భీమవరం: భీమవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తలుపుల తాళాలు బద్ధలు కొట్టి బీరువాలోని సుమారు 13 కాసుల బంగారు అభరణాలు, దాదాపు 30 వేల నగదు దోచుకున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి భర్త విధి నిర్వహణకు వెళ్లగా భార్య అత్తిలి మండలంలోని పుట్టింటికి వెళ్లింది. సోమవరం ఉదయం భార్య ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు విచారణ చేస్తున్నారు.
పెనుగొండ: వడలిలో ఒకే రోజు మూడు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పెనుగొండ సీఐ ఆర్.విజయకుమార్, ఆచంట ఎస్సై వెంకట రమణ ప్రత్యేక టీంగా ఏర్పడి దర్యాప్తు చేయగా బొమ్మూరుకు చెందిన ప్రగడ నాగ శివ, యర్రవరం గ్రామానికి చెందిన ఆచంట శివ పద్మనాభంలను సోమవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.4,350 నగదుతో పాటు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.


