ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాం
● గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపు
కాళ్ల: నియోజవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామస్థాయి కమిటీలు బలోపేతం చేయాలని, పది వేల మందిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేయా లని చెప్పారు. నియోజవర్గంలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా స్పందించి అండగా ఉండాలని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలన్నారు. అధికారు లు, అధికార పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ నా యకులు, కార్యకర్తలపై అన్యాయంగా ఎటువంటి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసినా వారికి అండగా ఉండి డిజిటల్ బుక్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఆకివీడు మున్సిపల్ చైర్‌పర్సన్ జామి హైమావతి, జెడ్పీటీసీలు వేగేశ్న వెంకటరాజు (ఆకివీడు), ర ణస్థలి మహంకాళి (ఉండి), ఉండి ఎంపీపీ ఇందు కూరి శ్రీహరి నారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు, ఆకివీడు మండల అధ్యక్షుడు అంబటి రమేష్, ఉండి మండల అధ్యక్షుడు పెనుమత్స ఆంజనేయరాజు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కొండేటి శివకుమార్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ధనుంజయ్, స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ సునీల్‌వర్మ, స్టేట్ గ్రీవెన్స్ సెక్రటరీ రామచంద్రరావు, నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు బందేల ప్రమిల, స్టేట్ ఐటీ వింగ్ సెక్రటరీ పడాల కిషోర్ రెడ్డి, సాగిరాజు హరివర్మ, గులిపల్లి అచ్చా రావు, కటారి లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాం


