మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు
● ప్రయాణానికి ఆటంకాలు
● ప్రజలకు తప్పని తిప్పలు
పెనుగొండ: అసలే ఉచిత బస్సు ప్రయాణ పథకంతో అరకొరగా నడుపుతున్న ఆర్టీసీ బస్సులు పలు రూట్లలో మొరాయిస్తుండడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. పెనుగొండ–తణుకు, మార్టేరు–పెనుమంట్ర, మార్టేరు–ఆచంట రహదారుల్లో నిత్య ం ఏదోక బస్సు మొరాయిస్తూ కనిపిస్తోంది. సీ్త్రశక్తి పథకంతో ఇంచుమించుగా ఆర్టీసీ బస్సులు మొత్తం మహిళలతో నిండిపోవడంతో ఆగిన బస్సులను తిరిగి స్టార్ట్ చేయడానికి మహిళలే తోస్తున్న పరిస్థితి. ఇటీవల ఇదే సమస్యను మహిళలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మార్టేరు–పెనుమంట్ర రహదారిలో ఆర్టీసీ బస్సు బ్యాటరీ సమస్యతో నిలిచిపోయింది. దీనిని తిరిగి స్టార్ట్ చేయడానికి బస్సులో ఒక్క మగ ప్యాసింజరూ లేకపోవడంతో మహిళలే బస్సు దిగి తోయాల్సి వచ్చింది. ఇక మార్టేరు–ఆచంట రహదారిలో గోతులు ఉండటంతో అరకొరగా నడిచే బస్సు లు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. దీంతో బస్సు లోని ప్రయాణికులు మరో బస్సు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఇక పెనుగొండ–సిద్ధాంతం మార్గంలో రోడ్డు అధ్వానంగా ఉండటంతో నిత్యం ఏదోక బస్సు గంటల తరబడి మొరాయిస్తోంది. దీంతో డ్రైవర్, కండక్టర్లు తిరిగి స్టార్ట్ చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
గంటల తరబడి ఎదురుచూపులు
ఎక్కిన బస్సు ఎపుడు వెళుతుందో తెలియదు. ఎ క్కాల్సిన బస్సు ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో పెనుగొండ–సిద్ధాంతం మార్గంలో వి ద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. సిద్ధాంతం పరిసర ప్రాంతాల నుంచి పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలకు నిత్యం వందలాది మంది విద్యార్థులు బస్సుల్లో వస్తుంటారు. ఈ క్రమంలో మొరాయిస్తున్న, కిక్కిరిసిన బస్సులతో వీరు చాలా ఇబ్బంది పడుతు న్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు రద్దీ రూట్లలో అదనపు బస్సులు నడపాలంటూ ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.
మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు


