పీఆర్సీని ప్రకటించాలి
భీమవరం : పెండింగ్ బకాయిలు చెల్లిస్తూ 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ జి ల్లా శాఖ అత్యవసర కార్యవర్గ సమావేశం ఆదివారం భీమవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రధాన సంఘాలను ఏకం చేసుకుని వచ్చేనెల 5న మరోమారు ఉద్యమించనున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్సీ డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, ఏపీజీఎల్‌ఐ పీఎఫ్ లోన్ల చెల్లింపునకు రోడ్డు మ్యాప్ విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. టెన్త్ విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్‌ను అందిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు పి.సాయివర్మ, ప్ర ధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, రాష్ట్ర కౌ న్సిలర్ పుప్పాల ప్రకాష్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 68వ పాలక మండలి సమావేశం సోమవారం ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నట్టు ఉప కుల పతి కె.ధనుంజయరావు తెలిపారు. వర్సిటీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సమీక్షించి, రా బోయే కాలానికి అవసరమైన ప్రణాళికలను నిర్దేశించడంపై చర్చిస్తామన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , ఆర్థిక శాఖ కా ర్యదర్శి, ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ వి శ్వవిద్యాలయం, వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం ఉప కులపతులు, రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మాధవిలు హాజరవుతారన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే మీ కోసం కాల్ సెంటర్ 1100, మీకోసం వెబ్‌సైట్ ద్వారాసమస్యలను తెలియజేయవచ్చన్నారు.
భీమవరం: జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించనున్నారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీసుల ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహ దారి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా వేదికను మార్చారు. ఫిర్యాదుదారులు సోమ వారం ఉదయం భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో కోరింది.
కొయ్యలగూడెం: మండలంలోని సీతంపేటలో గృహాలకు ఉన్న విద్యుత్ సర్వీసుల తొలగింపు వివాదాస్పదమైంది. ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది దళితవాడలోని ఇళ్లకు విద్యుత్ సర్వీసులను తొలగించారని బాధితులు ఆరోపించారు. తాము 30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమ ప్రాంతంపై కన్నేసిన కొందరు కబ్జాకు ప్రయత్నిస్తూ కక్ష సా ధింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వ్యక్తుల పొలం పక్కన తమ ఇళ్లు ఉన్నాయని, వాటిని ఖాళీ చేయించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. పండుగ నేపథ్యంలో ఇళ్లకు వచ్చిన పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఉంటున్నామని, ఎలాంటి నోటీసు లు ఇవ్వడకుండా విద్యుత్ సర్వీసులు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందించి గృహాలు నిర్మించాలని కోరుతున్నారు.


