మావుళ్లమ్మను దర్శించుకున్న భక్తులు
భీమవరం (ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ అమ్మవారి 62 వార్షికోత్స మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శివకేశవ నృత్యాలయం, కూచిపూడి నాట్యమండలి వారు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అకట్టుకున్నాయి. శ్రీనివాసా చైతన్య కళా నాట్యమండలి ప్రదర్శించిన వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర నాటకం అలరించింది. అమ్మవారిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. జిల్లా ప్రజలతోపాటు సంక్రాంతికి జిల్లాకు వచ్చిన ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సహయ కమిషనర్ బుద్దా మహలక్ష్మీ నగేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ సెలవులు ముగుస్తున్నందున అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు మద్ది క్షేత్రానికి వచ్చారు. ఆంజనేయస్వామిని దర్శించుకుని, మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామికి ఆలయ ముఖ మండపంపై పంచామృతాభిషేకం కార్యక్రమం అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.3,10,510 ఆదాయం రాగా, నిత్యాన్నదాన సత్రంలో 3,050 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
భీమవరం: మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం టూటౌన్ ఎస్సై రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాయలం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక పట్ల అదే గ్రామానికి చెందిన కోనాల సరస్వతి(84) అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆకివీడు: సంక్రాంతి యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు శనివారం రాత్రి ఉత్సాహభరితంగా ముగిశాయి. ఏలూరుపాడు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జట్టు ద్వితీయ స్థానం, కమతవాని గూడెం జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోపిమూర్తి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పిల్లల వైద్యుడు పీబీ.ప్రతాప్ కుమార్ అధ్యక్షత వహించారు.
యలమంచిలి : అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఆకన శ్రీ కళ్యాణ్ (27) ఈ నెల 15 నుంచి కనిపించడం లేదని, అతని తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.గుర్రయ్య తెలిపారు. బెట్టింగ్‌కు అలవాటు పడిన కల్యాణ్ అప్పులు చేశాడు. వైజాగ్‌లో ఉంటున్న అతను సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామం వచ్చాడు. ఈ నెల 15న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అతని బైక్ యలమంచిలి మండల పరిధిలోని చించినాడ వశిష్ఠ గోదావరి నది వంతెనపై కనిపించడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు.
పాలకోడేరు: గరగపర్రులో ఉండి కాల్వపై వంతెన ప్రమాదకరంగా మారింది. శనివారం రాత్రి ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తూ జారి అయి పడిపోయాడు. బైక్ కాల్వలో పడగా.. అతను వంతెనపై పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల సాయంతో బైక్ పైకి తీశారు. వంతెన నిర్మించే వరకు రెయిలింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
మావుళ్లమ్మను దర్శించుకున్న భక్తులు
మావుళ్లమ్మను దర్శించుకున్న భక్తులు
మావుళ్లమ్మను దర్శించుకున్న భక్తులు


