తుది దశకు కబడ్డీ పోటీలు
నరసాపురం : నరసాపురం రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ జాతీయ స్థాయి మహిళలు, పురుషుల ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. పోటీలు తుదిదశకు చేరుకోవడంతో గెలుపు కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. ఉదయం సెమీస్, రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. ఇంతవరకూ జరిగిన మ్యాచ్‌ల్లో పురుషుల విభాగంలో ఆంధ్రా, ఢిల్లీ, యూపీ జట్లు, మహిళల విభాగంలో ఢిల్లీ, రాజస్థాన్, కేరళ జట్లు ముందంజలో ఉన్నాయి. ఆంధ్రా జట్టు చండీగఢ్‌పై 14 పాయింట్ల తేడాతో, మహారాష్ట్ర జట్టు హర్యానాపై 3 పాయింట్ల తేడాతో, ఢిల్లీ జట్టు హర్యానాపై 36 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. మహిళల విభాగంలో తెలంగాణా జట్టు ఆంధ్రాపై 9 పాయింట్ల తేడాతో, మహారాష్ట్ర ఢిల్లీ జట్టుపై 6 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. కేరళ, హర్యానా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెరి 13 పాయింట్లు సాధించడంతో టై అయ్యింది.


