స్వల్ప పెట్టుబడులతో అధిక దిగుబడులు
జాఫ్రా మొక్కలు కొండల్లో, గుట్టల్లో సహజసిద్ధంగా పెరుగుతుంటాయి. జాఫ్రా కాయల నుంచి ఎర్రటి లిప్‌స్టిక్ గింజలు తీస్తారు. ఈ సాగును గిరిజన రైతులు పోడు, మెట్ట ప్రాంతాల్లో చేస్తున్నారు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే 25 ఏళ్ల వరకూ దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. స్వల్ప పెట్టుబడితోనే అధిక దిగుబడులు కూడా వస్తున్నాయని పంటలు వేసిన రైతులు అంటున్నారు. 9 నెలల్లోనే పంట చేతికి వస్తుందని గతేడాది కేజీ రూ.500 నుంచి రూ.600 వరకూ పలికిందని తెలిపారు. క్వింటాకు రూ.60,000 వరకూ ధర వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. ఎకరాకు రూ.1.20 లక్షల వరకూ ఆదాయం వస్తుందని చెబుతున్నారు. పంట


