వెనెజువెలాపై దురాక్రమణ దారుణం
భీమవరం: వెనెజువెలాపై అమెరికా దురాక్రమణను ఖండించాలని శనివారం పట్టణంలోని మెంటేవారితోటలోని సుందరయ్య భవనంలో పోస్టర్ ఆవిష్కరించారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం మాట్లాడుతూ అమెరికా దుర్మార్గంగా వెనెజువెలాపై దాడిచేసి ఆ దేశాధ్యక్షుడు, అతని భార్యను ఎత్తుకుపోవడం దుర్మార్గమన్నారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నా ట్రంప్, అమెరికా సామ్రాజ్యవాద నాయకత్వం సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా చర్యలను చిన్న దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నా ప్రపంచంలో అతిపెద్ద సార్వభౌమాధికారం కలిగిన దేశానికి ప్రధానినని చెప్పుకుంటున్న మోదీ నోరు మెదపకపోవడం మంచిదికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వాసుదేవారావు, జక్కంశెట్టి సత్యనారాయణ, జుత్తిగ నర్సింహమూర్తి, ఇంజేటి శ్రీను, ఎం.వైకుంఠరావు, మల్లిపూడి ఆంజనేయులు పాల్గొన్నారు.


