ఎస్‌ఆర్‌కేఆర్‌కు జాతీయస్థాయి అవార్డు
భీమవరం: స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు లభించిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ మంగళవారం విలేకరులకు తెలిపారు. గత నెల 25వ తేదీన హైదరాబాద్‌లో బ్రెయినో విజన్ సంస్థ నిర్వహించిన ఓవరాల్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ఇట్స్ ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ లీడర్‌షిప్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్‌లో అవార్డు లభించందన్నారు. అలాగే లీడర్‌షిప్ ఇన్నోవేషన్‌లో విద్యార్థులను ప్రోత్సహించడంలో కృషి చేసిన ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజుకు భీష్మాచార్య అవార్డు, టీచింగ్ ఇన్నోవేషన్, హ్యాకథాన్ ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో కృషి చేసిన ఐటీ డిపార్ట్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్ ఐ హేమలత ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకుకున్నట్లు చెప్పారు. కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి మూడువేల నామినేషన్లు అందగా వాటిలో 250 మందికి అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు.


