కొల్లేరు వాసుల్లో పాముల భయం
పాము కాటుకు భయపడొద్దు
కై కలూరు: కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సిద్దాబత్తుల విజయ (32) కిరాణాకొట్టుతో జీవనం సాగిస్తోంది. ఆమె భర్త దుర్గారావు పెయింటర్. వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం సాయంత్రం కొట్టు ప్రిజ్‌లో పాలప్యాకెట్ తీసుకొస్తుండగా నాగుపాము కాటేసింది. భర్త సమీపంలో కలిదిండి పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కై కలూరు, ఏలూరు ఆస్పత్రులకు మెరుగైన వైద్యం కోసం వెళ్లగా చికిత్స పొందతూ ఆమె శుక్రవారం మరణించింది.
కై కలూరు మండలం వరహాపట్నం గ్రామంలో కొన్ని నెలల క్రితం కత్తుల కౌసల్య(40) ఇంటి వద్ద నిద్రిస్తుండగా నాగుపాము కాటు వేసింది. అర్థరాత్రి కావడంతో గ్రామంలో నాటు వైద్యుని వద్దకు వెళితే నా వల్ల కాదన్నాడు. ఆటోలో ప్రభుత్వాసుపత్రికి వెళుతుండగా మరణించింది. భర్త వ్యవసాయ కూలీ. చదువుతున్న ముగ్గురు పిల్లలకు తల్లి ప్రేమ దూరమైంది. ఇలా ఇటీవల అనేక ఘటనలు జరుగుతున్నాయి.
ఆలస్యం.. అమృతం.. విషం అనేది పురాతన సామెత. పాము కాటు విషయాల్లో నేడు ఇదే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మంత్రాలు, ఆకుపసర, ఆయుర్వేదం అంటూ అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సలో ఆలస్యం జరుగుతుందని బాధితులు లబోదిబోమంటున్నారు. కై కలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది నుంచి ఇప్పటి వరకు ఆయా పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో కై కలూరు మండలంలో 117, కలిదిండి మండలంలో 56, ముదినేపల్లి మండలంలో 14, మండవల్లి మండలంలో 1 కలిపి మొత్తం 188 పాము కాటు కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలకు రాకుండా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన కేసులు ఎక్కువగానే ఉన్నాయి.
అన్ని పాములు విషపూరితం కావు
భారతదేశంలో 570 రకాల పాము జాతులు ఉన్నాయి. వీటిలో 60 రకాలు మనుషులను చంపే అవకాశం ఉన్న పాములుగా గుర్తించారు. ప్రతి ఏటా పాము విషం వల్ల, పాము కాటు భయంతో సుమారు 50 వేల మంది మరణిస్తున్నారని అంచనా. ప్రధానంగా నాగుపాము, కట్లపాము, రక్తపింజరి పాముల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. నాగుపాము కంటే కట్లపాము కాటును గుర్తించకపోవడం, నొప్పు తెలియకపోవడంతో చికిత్స సకాలంలో అందక ఎక్కువ మంది మరణిస్తున్నారు. పాము కాటుకు విరుగుడు మందు స్నేక్ వినమ్ ఏంటీ సిరమ్ ఐపీ పీహెచ్‌సీలలో అందుబాటులో ఉంది.
పాము కాటును ఇలా గుర్తించండి..
● విషపూరిత పాము కాటు వేసినప్పుడు రెండు చుక్కల గాట్లు కనిపిస్తాయి.
● విషరహిత పాము కాటు వేస్తే ఎక్కువ సంఖ్యలో చుక్కల గాట్లు ఉంటాయి.
● కరిచిన చోట రక్తం కారుతూ, ఎర్రగా మారి పోటుతో పాటు వాపు ఉంటుంది.
● కళ్లు తిరగడం, వాంతులు, వికారం, విరేచనలు, కళ్లు తెరవలేకపోవడం.
● కరిచిన పాము కనిపిస్తే సెల్ ఫోన్‌లో ఫొటో తీసీ డాక్టర్‌కు చూపించాలి.
● కరిచిన చోటును తుడవకూడదు. ఆ వ్యక్తికి ఆహారం పెట్టకూడదు.
ఇవి పాటించండి
● సినిమాల్లో చూపినట్లుగా కోసి రక్తం పీల్లడం, కట్టు కట్టడం వద్దు.
● కాటుకు గురైన వ్యక్తికి విరుగుడు మందు ఉందని ధైర్యం చెప్పాలి.
● పాము కాటు బారిన పడ్డ వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో నడిపించవద్దు.
● కాటు వేసిన 15 నుంచి 30 నిమషాలలోపు ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
● మంత్రాలు, ఆకుపసర్లంటూ ఆలస్యం చేయవద్దు.
● కాటు వేసిన పామును చంపాలనే కోపంతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు.
సిద్ధాబత్తుల విజయ, వెంటాపుర, (ఫైల్)
కత్తుల కౌసల.్య వరహాపట్నం (ఫైల్)
పెరుగుతున్న పాము కాటు కేసులు
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 188 కేసుల నమోదు
పలు ఘటనల్లో ప్రాణాలు పోతున్న వైనం
అవగాహన లోపంతో అలస్యంగా ప్రథమ చికిత్స
ఇప్పటికీ గ్రామాల్లో మంత్రాలు, ఆకు పసరుపై ఆధారం
పాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా అందరూ ధైర్యం చెప్పండి. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో విరుగుడు మందు ఏఎస్‌వీ అందుబాటులో ఉంది. ఆలస్యం జరిగితే బాధితుడి నాడి వ్యవస్థ దెబ్బతింటుంది. కాటుకు గురైన వ్యక్తిని కదలించకుండా గంటలోపు ఆస్పత్రికి తీసుకురావాలి. మంత్రాలు, ఆకుపసర్ల జోలికి వద్దు.
– అల్లాడి శ్రీనివాసరావు, సూపరిండెంటెండెంటు, సీహెచ్‌సీ, కై కలూరు
కొల్లేరు వాసుల్లో పాముల భయం
కొల్లేరు వాసుల్లో పాముల భయం
కొల్లేరు వాసుల్లో పాముల భయం
కొల్లేరు వాసుల్లో పాముల భయం
కొల్లేరు వాసుల్లో పాముల భయం


