ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడి మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెం సమీపంలో ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. ఎస్సై వి. క్రాంతికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్రివారిగూడెంకు చెందిన పొట్టా అఖిల్ (18) జీలుగుమిల్లికి ట్రాక్టర్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి మొద్దుపై ఎక్కి తిరగబడింది. ఈ ప్రమాదంలో అఖిల్‌పై ట్రాక్టర్ చక్రం ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ క్రీడా పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాలీబాల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో ఏఆర్‌డీజీకే ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అఖిల్ శ్రీ వర్మ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ఆదివారపుపేట ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (ఏఆర్‌డీజీకే) కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. విద్యార్థి అఖిల్ శ్రీ వర్మను, వ్యాయామ ఉపాధ్యాయులు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బదాసరి జోజి బాబులను ప్రధానోపాధ్యాయుడు ఉన్నమట్ల కాంతి జయకుమార్, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడి మృతి


