జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు విద్యార్థి ఎంపిక
నరసాపురం: పట్టణంలోని 24వ వార్డుకు చెందిన గోడి స్పార్క్ ఏంజలిన్ డిసెంబర్‌లో హర్యానాలో జరిగే అండర్–14 జాతీయస్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికై ంది. 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో ఈనెల మూడో తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించిన లాన్ టెన్నిస్ క్రీడా పోటీల్లో ఆమె పాల్గొని మూడవ స్థానం సాధించింది. దీంతో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికై నట్లు తల్లిదండ్రులు వీలిన్ కుమార్, మేరీ ళత తెలిపారు. స్పార్క్ ఏంజలిన్ స్థానిక జె సికిలే స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది.
భీమవరం (ప్రకాశంచౌక్): కార్తీక మాసం సందర్భంగా భీమవరం గునుపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సుమారుగా 3,500 మంది భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానానికి దర్శనాలు,, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా రూ.17,222 ఆదాయం రాగా నిత్యాన్నదానానికి రూ.1,12870 వచ్చినట్లు ఈఓ తెలిపారు.
భీమవరం: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో భీమవరం జిల్లా పీఎఫ్ కార్యాలయానికి అఖిల భారతస్థాయి లభించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత జిల్లా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి డి ఎలీషారావును మంగళవారం భీమవరంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సత్కరించారు. భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరేటి ప్రకాష్, సీపీఎం నాయకుడు మల్లుల సీతారామ్‌ప్రసాద్, కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, జి సురేష్‌కుమార్, సాయి రాజేష్, అల్లూరి సుభాస్‌చంద్రబోస్, నాచు చంద్రరావు తదితరులు ఎలీషారావుకు అభినందనలు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల
ఆందోళన
చింతలపూడి : సమస్యల పరిష్కారం కోరుతూ నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఆందోళన చేశారు. దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి. కమిషనర్ ఎ.రాంబాబుతో సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకుల మధ్య జరిగిన చర్చల్లో కార్మికులకు డిసెంబర్ 1 నుంచి రూ.21 వేలు ఇవ్వటానికి కమిషనర్ అంగీకారం తెలపటంతో ఆందోళనను విరమించారు.
జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు విద్యార్థి ఎంపిక
జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు విద్యార్థి ఎంపిక


