కుల అంతరాలు లేని సమాజమే లక్ష్యం
నరసాపురం: కుల అంతరాలు లేని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సమాజాన్ని అంబేడ్కర్ కోరుకున్నారని, అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. అంబేడ్కర్ జయంతిని నరసాపురం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకలో ముదునూరి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అభివృద్ధి చెందిన సమాజంలో కుల అసమానతలకు చోటు ఉండకూడదని అంబేడ్కర్ ఆశించారని ముదునూరి చెప్పారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని వరంగా ఇచ్చారని కొనియాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా టాక్సీస్డాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని, ఎంపీపీ మైలాబత్తుల సోనీ, జడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాబ్జీ, పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు, కో–ఆప్షన్ సభ్యుడు వైకేఎస్, పార్టీ నాయకులు చాగంటి సత్యనారాయణ, పప్పుల రామారావు, షేక్ బులిమస్తాన్, బర్రి శంకరం, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కామన బుజ్జి, ఉంగరాల రమేష్‌నాయుడు, ముసూడి రత్నం, రావి బ్రహ్మాజీ, కావలి నాని, యర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు


