పండుగ పూట విషాదం
● మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న వ్యాన్
● యువకుడి మృతి.. అతని సోదరుడికి గాయాలు
● కురెళ్లగూడెంలో విషాదఛాయలు
భీమడోలు: పండుగ సరుకుల కోసం బయటకు వచ్చిన ఓ యువకుడ్ని వ్యాన్ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో కురెళ్లగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. కురెళ్లగూడెంకు చెందిన కొండేటి వినయ్‌కుమార్ (18), వరుసకు సోదరుడైన సత్యకిరణ్ పండుగ సరుకుల కోసం మోటార్‌సైకిల్‌పై భీమడోలు వెళ్లారు. తిరిగి కురెళ్లగూడెం వస్తూ డివైడర్ సమీపంలోని మార్జిన్ వద్ద ఆగగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న వ్యాన్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వినయ్‌కుమార్ దుర్మరణం చెందగా, సత్యకిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఫ్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వినయ్‌కుమార్ తండ్రి దుర్గ రమేష్ ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్‌కే మస్తాన్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరుకుల కోసం వెళ్లిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటన పండగు నాడు కురెళ్లగూడెంలో విషాదం నింపింది.
పండుగ పూట విషాదం
పండుగ పూట విషాదం


