చంద్రబాబు ప్రభుత్వంలో కళ తప్పిన సంక్రాంతి
జంగారెడ్డిగూడెం: సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నల పండుగ అని, అది చంద్రబాబు ప్రభుత్వంలో కొరవడిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. సంక్రాంతి వేళ వైఎస్సార్‌సీపీ కుటుంబ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా ఆమె ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విచ్చేశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల, జిల్లా, రాష్ట్రనాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విత్తు విత్తే నాటి నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉండిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో అవసరాలు తీర్చేలా ఆర్‌బీకేలను అభివృద్ధి చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. సంప్రదాయ సేవలతో పాటు సాంకేతిక సేవలు కూడా ఆర్‌బీకేల ద్వారా నాడు అందిస్తే, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రైతుకు పెట్టుబడి సహాయం కూడా అందడం లేదన్నారు. నేటి చంద్రబాబు పాలనలో విత్తు నాటిన చేతితోనే పంటను తీసేసే పరిస్థితి రైతుకు ఏర్పడిందన్నారు. నాడు రైతు కోసం రాజన్న, అనంతరం జగనన్న నిలబడి వారి ఉన్నతికి దోహదపడ్డారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం రైతును రోడ్డున వదిలేసిందని శ్యామల అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజా అవసరాల నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తే, నేడు వారి జేబులు నింపుకునేందుకు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులను, చంద్రబాబు ప్రభుత్వం కేవలం రెండేళ్లల్లోనే అధిగమించి కొత్త రికార్డును సృష్టించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని, 2029లో జగనన్న గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2029లో జగనన్న గెలిచాక నిజమైన సంక్రాంతి చేసుకుందామని శ్యామల పిలుపునిచ్చారు.
చరిష్మా ఉన్న నాయకుడు జగన్
చరిష్మా ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాధరావు అన్నారు. రెడ్‌బుక్, మెడికల కళాశాలల జీఓ తదితర ప్రజావ్యతిరేక పనులకు సంబంధించిన ప్రతులను దహనం చేయడానికి ప్రజలు ముందుకు రావడం ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గవరయ్య గుప్త, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, వీరవల్లి సోమేశ్వరరావు, లక్కవరం గంగాప్రసాద్, మహ్మద్ ఉమర్ షరీఫ్, గంజి వినోద్, బత్తిన చిన్న, అయినాల రమణమూర్తి, తాడేపల్లి ఉమ, కొయ్య లీలాధర్‌రెడ్డి, ఆరీఫ్, కాసర సోమిరెడ్డి, రమేష్‌రెడ్డి, గగ్గల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల


