మహానేతకు పండుగ నైవేద్యం
తొలిపంట ధాన్యంతో అభిషేకించిన రైతులు
కొయ్యలగూడెం: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి రైతులు తొలిపంట ధాన్యంతో అభిషేకం, పండుగ నైవేద్యం సమర్పించి తమ అభిమానాన్ని చాటారు. రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో మహానేత విగ్రహానికి తొలి పంటను(ఖరీఫ్ ధాన్యం) విగ్రహం వద్ద ఉంచి నూతన వస్త్రాలను విగ్రహానికి కట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ కన్వీనర్ కంచర్ల సత్యనారాయణ మంగా వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మరికొందరు రైతులు భోగి పండుగ పురస్కరించుకొని తమ ఇళ్లలో వండిన పిండి వంటలను విగ్రహాన్ని వద్ద ఉంచి నైవేద్యం సమర్పించారు. సంక్రాంతి పండుగ వేళ పూర్వీకులను, పితృ దేవతలను కొలవడం శుభ సూచకం అని, రైతాంగానికి దేవుడైన వైఎస్సార్‌ను ఈ విధంగా పూజించడం కృతజ్ఞతకు పట్టం కట్టడం వంటిదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి పేర్కొన్నారు. మహానేత ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఎంపీటీసీ కొండేపాటి చింతయ్య, తమ్మిర్చి బ్రహ్మన్న, ఉండి ఆనందరావు, కొడారి చిన్న, కొడారి బాలయేసు, కె శ్రీను, కె రేఖ, తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: నరసాపురం మండలం సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నుంచి హెలీకాప్టర్ ఎడ్వంచర్ రైడ్స్ ప్రారంభమయ్యాయి. శుక్రవారం వరకూ ఈ రైడ్స్ జరుగున్నాయి. విహాంగ్ పేరుతో తీరప్రాంతంలో మొట్టమొదటిసారి హెలీకాప్టర్ ఎడ్వంచర్ రైడ్స్ నిర్వహిస్తుండడంతో పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రైడ్‌కు సంబందించి టిక్కెట్ ధర రూ.5 వేలు ఉండటంతో కుటుంబ పరంగా విహాంగ వీక్షణం చేద్దామనుకునేవారికి భారంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.
మహానేతకు పండుగ నైవేద్యం


