గోవిందకుంట చెరువులో మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

గోవిందకుంట చెరువులో మట్టి దందా

Apr 5 2025 1:26 AM | Updated on Apr 5 2025 1:26 AM

ద్వారకాతిరుమల: స్థానిక పంచాయతీకి చెందిన గోవిందకుంట చెరువులో మట్టి అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్నారు. ప్రధానంగా జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు తవ్వకాలు జరుపుతూ కొందరు కూ టమి నేతలకు ట్రాక్టర్‌కు ఇంతని ముట్టచెబుతున్నట్టు సమాచారం. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ మట్టిని రూ.700 నుంచి రూ.900కి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వైపు నుంచే మట్టి ట్రాక్టర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు గట్టును సైతం అక్రమార్కులు తవ్వేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేద ని స్థానికులు అంటున్నారు.

నేడు పాఠశాలలకు సెలవు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు శనివారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సెలవు అని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు పాటించని యాజమాన్యాలపై చ ర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

స్లాట్‌ బుకింగ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

భీమవరం (ప్రకాశం చౌక్‌): రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ విధానం జిల్లాలో అమలులోకి వచ్చింది. పైలెట్‌ ప్రాజెక్టుగా భీమవరంలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ విధానాన్ని శుక్రవారం ప్రారంభించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న 15 రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

జేఈఈ మెయిన్స్‌కు 250 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జేఈ ఈ మెయిన్స్‌ సెషన్‌–2 పరీక్షలకు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం షిఫ్టులో 115 మందికి 106 మంది, మధ్యాహ్నం షిఫ్టు లో 152 మందికి 144 మంది హాజరయ్యారు.

ఆటో డ్రైవర్ల ఆక్రందన

ఏలూరు (టూటౌన్‌): రాపిడో, ఊబర్‌, ఓలా సంస్థల అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులో ఆటో డ్రైవర్లు గళమెత్తారు. శుక్రవారం పాత బస్టాండ్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ర్యాపిడో, ఊబర్‌, ఓలా సంస్థలు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసుకుని కోట్లాది రూపాయలు ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయని మండిపడ్డారు. కేరళలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సవారీ యాప్‌ ద్వారా ఆటో, టాక్సీ డ్రైవర్లకు 6 శాతం కమీషన్‌కు సేవలందిస్తోందని, అయితే మన రాష్ట్రంలో రాపిడో వంటి సంస్థలు 25 నుంచి 30 శాతం కమీషన్లు గుంజుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కా ర్పొరేట్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు కేరళ, తమిళనాడు తరహా లో ఆన్‌లైన్‌ యాప్‌ తయారు చేయాలన్నారు.

గోనె సంచుల పంపిణీ

బాధ్యత మిల్లర్లదే

ఏలూరు(మెట్రో): రైతుల నుంచి ధాన్యం సేకరణలో భాగంగా సీఎంఆర్‌లో పాల్గొనే మిల్లుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు పంపాల్సి ఉంటుందని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రతాప్‌రెడ్డి ప్రకటనలో తెలి పారు. ముదినేపల్లి మండలం పెదగొన్నూరులోని గౌతమి రా అండ్‌ పార్‌ బాయిల్డ్‌ రైస్‌ మిల్‌ నుంచి భీమడోలు మండలంలో పూళ్ల–1 రైతు సేవా కేంద్రానికి 10 వేల గోనె సంచులు పంపారన్నారు. అయితే ప్రతి కట్టలో 20కి పైగా సంచులు చిరిగిపోయి ఉండటంతో సదరు రైస్‌మిల్లర్‌ను బాధ్యత వహించాల్సిందిగా తెలుపుతూ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశామన్నారు. అలాగే జిల్లాలో సీఎంఆర్‌లో పాల్గొనే మిల్లర్లంతా గోనె సంచులు తప్పక పంపాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement