జూలు విదిల్చిన జూదం | - | Sakshi
Sakshi News home page

జూలు విదిల్చిన జూదం

Jan 18 2026 8:08 AM | Updated on Jan 18 2026 8:08 AM

జూలు

జూలు విదిల్చిన జూదం

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: విచ్చలవిడితనం కట్టలు తెంచుకుంది.. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ‘పైసా’చికం పేట్రేగింది. వందల సంఖ్యలో కోడి పందేలను రూ.కోట్లలో నిర్వహించారు. జూదరులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి మరీ పగలు, రాత్రీ తేడా లేకుండా 72 గంటల పాటు జిల్లాలో జూద క్రీ డలు అప్రతిహతంగా సాగాయి. పండుగ మూడు రోజులు (భోగి, సంక్రాంతి, కనుమ) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1,000 కోట్ల మేరకు పందేలు, లావాదేవీలు జరిగినట్టు అంచనా. ఈ ఏడాది కీలక బరుల్లో రూ.కోటి, అంతకు మించి పందేలు నిర్వహించడంతో పాటు బహిరంగంగా సోషల్‌ మీడియా వేదికగా పందేల వివరాలు, విజేలతను ప్రకటించారు. ఇక కూటమి నేతలే నిర్వాహకులు కావడంతో మూడు రోజుల పాటు పోలీసులు పూర్తిగా స్టేషన్‌ విధులకే పరిమితమై బరుల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి.

మినీ క్యాసినోలను తలపించేలా..

ఉమ్మడి పశ్చిమలో కోడి పందేలు, జూద శిబిరాలు మూడు రోజుల పాటు కళకళలాడాయి. మినీ క్యాసినోలు తలపించేలా ప్రతి బరిలో జూద క్రీడలను ఏర్పాటు చేశారు. భారీ బరుల్లో తాగునీరు మొదలు మద్యం వరకూ అన్ని సౌకర్యాలు కల్పించారు. చిన్న, మధ్యస్థాయి బరుల్లో మద్యంతో సహా పదుల సంఖ్యలో బెల్టు షాపులు వెలిశాయి. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల్లో రూ.50 కోట్ల పైగా మ ద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కోడి పందేలు ఉపేక్షించమంటూ జిల్లా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం హడావుడి ప్రకటనలు, టోల్‌ఫ్రీ నంబర్ల ఏర్పాటు చేసి తమ పని తాము చేశామని చెప్పుకునే రీతిలో ముందస్తు షో చేసి మౌనం వహించడంతో విచ్చలవిడి జూద క్రీడలు కొనసాగాయి.

‘బరి’ తెగించి.. ‘కోట్లా’ట

● ప్రధానంగా ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరగణం భారీ బరిని ఏర్పాటు చేసి ప దుల సంఖ్యలో పేకాట శిబిరాలు కొనసాగించారు. శనివారం ఉదయం 5 గంటల వరకు నిర్విరామంగా పేకాట, కోడి పందేలు ఇక్కడ కొనసాగాయి. రూ.100 నుంచి రూ.50 వేల వరకు జూదక్రీడలు, రూ.వేల నుంచి రూ.లక్షల స్థాయి వరకు కోడి పందేలు పెద్దెత్తున జరిగాయి.

● ఉంగుటూరు నియోజకవర్గంలో 30 చోట్ల బరులు ఏర్పాటు చేయగా, నారాయణపురంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నేతృత్వంలో భారీ బరి ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో రూ.50 కోట్ల విలువైన పందేలు నియోజకవర్గంలో జరిగినట్లు అంచనా.

● తాడేపల్లిగూడెంలో రికార్డు స్థాయి కోడి పందేలు పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించారు. నియోజకవర్గంలో 27 బరుల్లో సుమారు రూ.50 కోట్ల పందేలు జరిగినట్లు అంచనా. ఒక్క వెంకటరామయ్య బరిలోనే రూ.కోటి పందేలు 5, ఇతర రకాల పందేలతో కలిపి రూ.15 కోట్లపైగా జరిగినట్లు అంచనా. పందెంరాయుళ్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించుకున్న రూ.1.53 కోట్ల పందెం ఇక్కడే జరిగింది. గుడివాడ ప్రభాకర్‌ వర్సెస్‌ రాజమండ్రి రమేష్‌ రా జు మధ్య జరిగిన కోడి పందెంలో రమేష్‌రాజు రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు. అలాగే ఆయన రూ. 90 లక్షల పందెం కూడా గెలిచినట్టు సమాచారం.

● నూజివీడు బరిలో తెలంగాణ సందడి అత్యధికంగా కనిపించింది. తెలంగాణ జిల్లా ఖమ్మానికి చెందిన అధికార పార్టీ నేతలు, నూజివీడు నేతలు, కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సంయుక్తంగా మీర్జాపురం బరి ఏర్పాటు చేసి భారీస్థాయిలో పందేలు నిర్వహించారు. ఇక్కడ రూ.కోటి పందేలు 4, రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు 20 వరకు పందేలు జరిగాయి. ఆంధ్రా, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో హాజరైన జూదరులకు మద్యంతో సహా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ ఒక్క బరిలోనే రూ.30 కోట్లకు పైగా నగదు చేతులు మారినట్లు అంచనా.

● ఉండి నియోజకవర్గంలోని పెద్ద అమిరంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు నేతృత్వంలో భారీ బరి ఏర్పాటు చేసి రూ.లక్షలు మొదలు రూ.కోట్లలో పందేలు నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అతిథుల కోసం కారవాన్‌లు కూడా ఏర్పాటుచేశారు.

జిల్లాలోని నూజివీడు, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ఇలా అన్ని ప్రధాన బరుల్లో రోజు వారి, మూడు రోజుల్లో అత్యధిక పందేలు గెలిచిన వారికి ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు బహుమతులు అందజేశారు.

కాసుకో.. దోచుకో..

పదుల సంఖ్యలో రూ.కోటి పందేలు

మూడు రోజులపాటు యథేచ్ఛగా జూదక్రీడలు

మినీ క్యాసినోలుగా బరులు

రూ.1,000 కోట్ల మేర లావాదేవీలు

కన్నెత్తి చూడని పోలీసులు

బరి స్థాయిని బట్టి వసూళ్ల పర్వం

జూలు విదిల్చిన జూదం 1
1/5

జూలు విదిల్చిన జూదం

జూలు విదిల్చిన జూదం 2
2/5

జూలు విదిల్చిన జూదం

జూలు విదిల్చిన జూదం 3
3/5

జూలు విదిల్చిన జూదం

జూలు విదిల్చిన జూదం 4
4/5

జూలు విదిల్చిన జూదం

జూలు విదిల్చిన జూదం 5
5/5

జూలు విదిల్చిన జూదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement