తిరుమల పవిత్రతను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

తిరుమల పవిత్రతను కాపాడాలి

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

హిజ్రాల రౌడీయిజం ఈస్టర్‌కు సన్నద్ధం

న్యూస్‌రీల్‌

టీటీడీ ప్రతిష్టకు భంగం

నైతికంగా దిగజారి..

హిజ్రాల రౌడీయిజం
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రుబాబు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీసులను కూడా వారు లెక్కచేయడం లేదు. 8లో u

క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్‌ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మృతిచెందిన తమ వారి సమాధులను సుందరంగా అలంకరించారు. 8లో u

ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి, భీమవరం: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో నిరసనలు చేపట్టారు. నాయుడు రాసలీలలు వెలుగుచూసినా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆ దిశగా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు ధ్వజమెత్తారు. వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించి వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు.

● తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వెలుపల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి బీఆర్‌ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్‌గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కొట్టు నాగేంద్ర, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబా రెడ్డి, పంచాయతీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

● తాడేపల్లిగూడెం కో–ఆర్డినేటర్‌ వడ్డి రఘురామ్‌ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యా లయం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పుంతలో ముసలమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. రఘురాం మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరు ఉందని మండిపడ్డారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే బీఆర్‌ నాయుడు వంటి వ్యక్తికి పవిత్ర టీటీడీ చైర్మన్‌ పదవి ఇవ్వడం దారుణమని విమర్శించారు. జిల్లా నాయకులు గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీనివాస్‌, మాకరాజు సతీష్‌, కై గాల శ్రీనివాస్‌, పొణుకుమాటి శేషులత తదితరులు పాల్గొన్నారు.

● పాలకొల్లులో బీఆర్‌ నాయుడు రాజీనామా చేయా లని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్‌) యడ్ల తాతాజీ, ఎస్సీ కమిషన్‌ మాజీ డైరెక్టర్‌ చెల్లెం ఆనందప్రకాష్‌, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం ప్రధాన కార్యదర్శి మద్దా చంద్రకళ పాల్గొన్నారు.

సద్బుద్ధి ప్రసాదించు స్వామీ !

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యవహారంపై ఆగ్రహం

నాయుడు రాసలీలలు వెలుగుచూసినా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజం

జిల్లాలో వైఎస్సార్‌సీపీ నిరసనలు

వేంకటేశ్వరస్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు కళంకంగా మారిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలి. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆయన్ను పదవిలో కొనసాగించడం దౌర్భాగ్యం. బీఆర్‌ నాయుడు రాసలీలల వ్యవహారం బయటకు వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ శ్రీవారి పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తోంది.

– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి

టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా, నైతికంగా దిగజారి ప్రవర్తిస్తున్న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించడం సిగ్గుచేటు. బీఆర్‌ నాయుడు అశ్లీల కార్యక్రమాలు బహిర్గతమైనా సీఎం పట్టించుకోకపోవడం సబబు కాదు. ఇలాంటి వ్యక్తులపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోరా. తిరుమల పవిత్రతను కాపాడాలి.

– వడ్డి రఘురాం, తాడేపల్లిగూడెం కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement