నిబంధనలు మీరితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు మీరితే చర్యలు

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

నిబంధనలు మీరితే చర్యలు పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై నిర్లక్ష్యం వద్దు కాంతారావుకు జాతీయ స్థాయి జ్యూరీ అవాస్టు బకాయిలు వెంటనే చెల్లించాలి జేఈఈ మెయిన్స్‌కి 1,147 మంది హాజరు

సాక్షి, భీమవరం: విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సి) అమలులో ప్రైవేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ పి.శ్యాంసుందర్‌ హెచ్చరించారు. ‘ఉచిత విద్య.. అంతా మిథ్య’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతగా 1,047 మంది పేద విద్యార్థులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందారన్నారు. ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రభుత్వం వీరికి 25 శాతం రిజర్వేషన్‌ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఈనెల 7వ తేదీలోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆదాయం, కులం, ఆధార్‌, తదితర సర్టిఫికెట్లతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తును తమకు కేటాయించిన పాఠశాలల్లో అందజేసి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో గత నవంబర్‌ 1 నుంచి మార్చి 31 వరకు పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కార ప్రగతిపై సమీక్షించారు. 13,738 ఫిర్యాదులకు 13,006 పరిష్కరించగా వాటిలో సమగ్రంగా పరిష్కరించని 732 ఫిర్యాదులను ఫ్రీ ఆడిట్‌ టీం ద్వారా గుర్తించామన్నారు. జిల్లా అధికారులు ప్రతి రోజు ఒక గంట అర్జీల పరిష్కారానికి కేటాయించాలని సూచించారు. జిల్లా స్వర్ణ, గ్రామ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఎం.రామనాథరెడ్డి, జిల్లా వైద్యారోగ్య అధికారి జి.గీతా బాయి పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరుకు చెందిన చిత్రకారుడు మజ్జి సూర్య కాంతారావు జాతీ య స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. శనివారం చైన్నె లలిత కళా అకాడమీ ఆర్ట్‌ గ్యాలరీలో శ్రీ ధరిణి కళైకూడమ్‌ (కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ నేషనల్‌ కాంపిటీషన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రతిష్టాత్మక జ్యూరీ అవార్డు అందుకు న్నారు. ఆయన గీసిన చిత్రాల్లోని సృజనాత్మక త, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే శైలి జ్యూరీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాథ్‌ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా 2022 నుంచి 2026 వరకు ఉన్న సరెండర్‌ లీవ్స్‌ బకాయిలు, మూడు డీఏలు,11 పీఆర్‌సీ అరియర్స్‌ ఇవ్వాలని కోరారు. 12 పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలకు శనివారం 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో ఉదయం 123 మందికి 110 మంది, మధ్యాహ్నం 116 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వా సవి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 184 మందికి 180 మంది, మధ్యాహ్నం 181 మందికి 174 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 116 మందికి 112 మంది, మధ్యాహ్నం 97 మందికి 93 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 100 మందికి 92 మంది, మధ్యాహ్నం 100 మందికి 92 మంది హాజరయ్యారు. డీఎన్నార్‌ కళాశాలలో ఉదయం 97 మందికి 95 మంది, మధ్యాహ్నం 96 మందికి 88 మంది హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement