పేదల ఇళ్ల తొలగింపు దుర్మార్గం
ఆకివీడు: పేదల బతుకులపై దెబ్బకొట్టడం, రోడ్డుపైకి ఈడ్చడం వంటి చర్యలు ఉండి నియోజకవర్గంలో ఎన్నడూ లేవని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల ఇళ్లు తొలగిస్తూ వారిని రోడ్డుపాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ధర్మాపుర అగ్రహారంలో ఇళ్ల తొలగింపు, చర్చి కూల్చివేత, రోడ్డు మార్జిన్లలో పేదల ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. శనివా రం బాధిత దళిత పేదలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సహా యం ఇస్తే తామే ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. సిద్ధాపురం వెళ్లే రోడ్డు మార్జిన్‌లో ఇళ్లు నిర్మించుకున్నప్పుడు ఎ లాంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు నోటీసు లు ఇవ్వడం దారుణమన్నారు. తప్పుడు సర్వే నంబర్‌తో నోటీసులు ఇచ్చారని అన్నారు. స్థానిక ఎ మ్మెల్యే ఆదేశాలతోనే నగర పంచాయతీ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నర్సింహరాజు మాట్లాడుతూ పేద ల ఇళ్లను దుర్మార్గంగా తొలగిస్తున్నారని, బాధితులకు ఎలాంటి పునరావాసం కల్పించడం లేదన్నారు. పునరావాసం కల్పించిన తర్వాతే తొలగించాలని కోర్టు ఆదేశాలున్నా కమిషనర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై పునః సమీక్షించాలని.. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హె చ్చరించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్షలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అయితే చంద్రబాబు ప్రభుత్వం పేదల ఇళ్లు పీ కివేస్తుందని ధ్వజమెత్తారు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల సీతారామ య్య, నగర పంచాయతీ వైస్ చైర్మన్ వంగా జ్యో త్స్నా, కౌన్సిలర్ గేదల అప్పారావు, ఎండీ జక్కీ, ఆ లీ, గుండుగొలను సావిత్రి, పడాల కిషోర్ రెడ్డి, జి. ధనరాజు, పళ్లెం అరుణకుమారి తదితరులు ఉన్నారు.
నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం
కాళ్ల: 50, 60 ఏళ్ల నుంచి జీవిస్తున్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా తొలగించడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బొండాడలో ఆయన పర్యటించారు. గ్రామంలో అభివృద్ధి పేరుతో ఇటీవల పేదల ఇళ్లను తొలగించగా.. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ప్రత్యమ్నాయం చూపిస్తామని చెప్పి ఇల్లు తొలగించి నమ్మించి మోసం చేయడం అన్యాయమని అన్నారు. అభివృద్ధి చేసి పార్టీ మా రానని చెబుతున్న సర్పంచ్ భర్త నాగరాజు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చూపించాలని నిలదీశా రు. వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామంలో రూ.3 కో ట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత చంద్రబాబు పాలనలో స్థలాలు ఇసా మని చెప్పి రూ.1.30 కోట్లు వసూలు చేశారని ప్రజ లు అంటున్నారన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన బాధిత కుటుంబాలకు స్థలాలు చూపించి ఆదుకోవాలని గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలని డి మాండ్ చేశారు. ఉప సర్పంచ్ ప్రసన్నకుమార్, నా యకులు గణేశ్న రాంబాబు, వేగేశ్న జయరామకృష్ణంరాజు, కొలుకులూరి ధర్మరాజు, వేగేశ్న రవిరాజు, గోళ్ల పండు తదితరులు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ ఉండి ఇన్‌చార్జి పీవీఎల్


