దళితులపై దాడులను సహించం
● వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై మండిపాటు
● మార్టేరు సెంటరులో నిరసన ప్రదర్శన
పెనుమంట్ర: కూటమి అరాచక పాలనను ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తలను దారుణంగా హత్య చేయటం అత్యంత ఘోరమని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెన్నం ఏడుకొండలు అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన మంద సాల్మన్‌రాజు హత్యను నిరసిస్తూ శనివారం మార్టేరు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచకాలను దళితులపై ప్రయోగిస్తే సహించేది లేదని, కూటమి ప్రభుత్వం దళితులపై తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సాల్మన్‌రాజ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జోగాడ ఉమామహేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ పోతిమూడి రామచంద్రరావు మాట్లాడారు. యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు వీర మల్లికార్జున్, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ కార్యదర్శి తవనంపూడి సూర్యరెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ పిల్లి రుద్రప్రసాద్, పెనుమంట్ర మండల మాజీ కన్వీనర్లు కర్రి వేణుబా బు, సత్తి విష్ణుకుమార్‌రెడ్డి, నాయకులు కోట వెంకటేశ్వరరావు, పలివెల శ్రీను, బుడితి భీమారావు, జి. సునీల్‌వర్మ, దొమ్మేటి రాంబాబు, గుబ్బల రా మకృష్ణ, కోటి శశి మధు, పీతల అంబేడ్కర్ పాల్గొన్నారు.


