శ్రీవారి క్షేత్రం.. భక్తజన సాగరం
సంక్రాంతి అతిథులతో కిటకిట
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. వేంకట రమణా గోవిందా.. స్మరణలు మార్మోగాయి. సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాలకు వచ్చిన వారి తో చినవెంకన్న క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. పండక్కి సొంతూళ్లకు వచ్చిన తిరుగు పయనమైన వేలాది మంది భక్తులు శనివారం మార్గమఽ ద్యంలో శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. దీనికితో డు శనివారం కావడంతో క్షేత్రం ఇల వైకుంఠాన్ని త లపించింది. క్షేత్రంలోని అన్ని విభాగాలు కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి షాపింగ్ కాంప్లెక్స్ వరకు భక్తులు బారులు తీరారు. ఎక్కువగా తెలంగాణకి చెందిన వారే. ఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు, డీఈ టి.సూర్యనారాయణ పర్యవేక్షించారు.
కిక్కిరిసిన క్యూలైన్లు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో..
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సాగరం
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సాగరం


