పద్మశ్రీ ఆదినారాయణ కన్నుమూత
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరానికి చెందిన పద్మశ్రీ అవార్డుగ్రహీత డాక్టర్ సుంకర ఆదినారాయణ శనివారం విశాఖలో కన్నుమూశా రు. ఆర్థోపెడిక్ వైద్యుడిగా ఖ్యాతి గాంచిన ఆయన విశాఖలో ఆస్పత్రి నడుపుతున్నారు. నాటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయన మృతికి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
తణుకు అర్బన్: ముద్దాయిలు సత్ప్రవర్తనతో జీవించాలని, సన్మార్గంలో నడవాలని నాల్గో అ దనపు జిల్లా జడ్జి డి.సత్యవతి అన్నారు. శని వారం స్థానిక సబ్‌జైలును ఆమె సందర్శించా రు. ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. కే సులు వివరాలు తెలుసుకుని, ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుందని అన్నారు. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పీవీఎన్ రంజిత్ కుమార్, జైల్ విజిటింగ్ న్యాయవాది ఎస్.లాజరు, పారా లీగల్ వలంటీర్ కాకర్ల నరసన్న, శ్రీహరిరావు, జైలు వార్డర్ ఉన్నారు.
పెంటపాడు: సంక్రాంతి పండుగ ముగిసినా చికెన్ ధరలు మాత్రం తగ్గలేదు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ధరలు పెరిగాయి. పండుగకు ముందు కిలో బ్రాయిలర్ చికెన్ స్కిన్‌లెస్ రూ.240 ఉండగా ప్రస్తుతం రూ.340కు విక్రయిస్తున్నారు. రికార్డుస్థాయిలో ధరల పెరుగుదలతో చికెన్ వండేందుకు పేదలకు ఆలోచిస్తున్నారు. పండుగ పేరుతో ముక్క కూడా గొంతు దిగడం లేదని, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో నిత్యావసర సరుకులతో పాటు అన్ని ధరలూ పెరుగుతున్నాయని అంటున్నారు.
ఆకివీడు: కూటమి ప్రభుత్వం విష సంస్కృతిని భవిష్యత్ తరానికి అందిస్తోందని ఎమ్మెల్సీ గోపీమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ రోజు ల్లో సంక్రాంతి సంప్రదాయం మాటున కోడి పందేలు, పేకాట, జూదం, ఇతర జూద క్రీడల్ని ప్రోత్సహించడం దారుణమన్నారు. డీవైఎఫ్‌ఐ సంక్రాంతి 43వ యువజనోత్సవాల ముగింపు సభ శనివారం స్థానిక జెడ్పీ స్కూల్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వాటిని వ్యతిరేకిస్తే చంపుతున్నారని ధ్వజ మెత్తారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్రాంతి పండుగలో విష సంస్కృతి పెరిగిపోయిందన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఆహ్వాన సంఘ గౌరవధ్యక్షుడు డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గేదల ధనుష్, పట్టణ అధ్యక్షుడు డోకల రవితేజ పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని, రైతు ప్రతిఘటన ఉద్యమం తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. శనివారం కొయ్యలగూడెం ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతిదేవిపేట గ్రామాల పరిధిలో ఏర్పాటు చే యాలని ప్రతిపాదించడాన్ని ఆయా గ్రామా ల రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికే రైతు లు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారన్నారు.
పద్మశ్రీ ఆదినారాయణ కన్నుమూత


