మాజీ మంత్రి కారుమూరి ధ్వజం
ఏలూరు టౌన్: స్వ చ్ఛతపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తణుకు పట్టణం చెత్త కుప్పగా మారిందని మాజీ మంత్రి కారు మూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్ర భుత్వంలో చెత్త సేకరించే వ్యాన్‌లను మూలన పడేసి ట్రై సైకిళ్లు తీసుకువచ్చారని, ఫలితంగా చెత్త సేకరణ నామమాత్రంగా మిగిలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని తెలిపారు. తణుకులో శ్లాటర్ హౌస్‌లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పశువధకు పాల్పడుతున్నారని విమర్శించారు. వందలాది పశువులను వధిస్తుండటంతో వేలా ది లీటర్ల రక్తం భూమిలో ఇంకిపోతూ ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతూ, ప్రజలు వ్యా ధుల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కు దీనిపై ప్రజలు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పట్టించుకోలేదని చె ప్పారు. శ్లాటర్ హౌస్ పేరుతో కోట్లాది డబ్బు లు చేతులు మారుతున్నాయని, తణుకు ఎమ్మెల్యేకి పావలా ఎమ్మెల్యే అని ప్రజలు పేరుపెట్టా రని గుర్తుచేశారు. తణుకు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని, కోడిపందేలు, పేకాట క్లబ్బులు, గంజాయి, క్రికెట్ బెట్టింగులు, అశ్లీల నృత్యాలతో ఎమ్మెల్యే అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా జోరుగా సాగుతోందని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు.