‘ఇందిరమ్మ’ బీమా నమోదులో వేగం | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ బీమా నమోదులో వేగం

Nov 29 2026 1:22 PM | Updated on Nov 29 2026 1:22 PM

‘ఇందిరమ్మ’ బీమా నమోదులో వేగం

వర్ధన్నపేట : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో లబ్ధిదారుల నమోదులో వేగం పెంచా లని ఎంపీడీఓ వెంకటరమణ చెప్పారు. మండలంలోని ఇల్లందలో నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి కార్యదర్శి శ్రీనివాస్‌కు సూచనలు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నమోదును వేగవంతం చేసే దిశగా మరో కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బేతి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పించాలి

సంగెం : బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ కాసర్ల రవీందర్‌ కోరారు. మండలంలోని ఆశాలపల్లిలో నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. దరఖాస్తుల పురోగతిపై పంచాయతీ కార్యదర్శి సృజనతో సమీక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కిశోర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులు వినియోగించుకోవాలి

నర్సంపేట రూరల్‌ : బీమా పథకాన్ని అర్హులు వినియోగించుకోవాలని ఇటుకాలపల్లి సర్పంచ్‌ మేర్గు సుమలత శ్రీనివాస్‌ కోరారు. ఆ గ్రామంలో నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి పలువురికి దరఖాస్తులు అందజేసి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement