రీసర్వేతో శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీసర్వేతో శాశ్వత పరిష్కారం

Nov 29 2026 1:22 PM | Updated on Nov 29 2026 1:22 PM

● అదనపు కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌, అధికారులు

గీసుకొండ/సంగెం/నెక్కొండ/దుగ్గొండి/నల్లబెల్లి/పర్వతగిరి : రీసర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, అధికారులు తెలిపారు. ఆయా మండలాల్లో శనివారం అవగా హనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీసుకొండ మండలంలో అదనపు కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌, సంగెం మండలంలో ఏడీ శ్రీనివాస్‌ మాట్లాడారు. నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి, పర్వతగిరి మండలాల తహసీల్దార్లు రాజ్‌కుమార్‌, సమ్మక్క, ముప్పు కృష్ణ, వెంకటస్వామి అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దుల నిర్ధారణ, రికార్డుల ప్రామాణికత, పారదర్శకత, ఇతర భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపగ్రహల సహాయంతో ఆధునికత పరికరాలతో సర్వే చేస్తున్న క్రమంలో ఖచ్చితమైన కొలతలు వస్తాయని తెలిపారు. తొలుత గ్రామ సరిహద్దు నిర్ధారిస్తారని చెప్పారు. అనంతరం, ప్రభుత్వ, శిఖం, ఆబాదీ భూముల కొలతలు, చివరగా పట్టా భూముల కొలతలు తీసుకుంటారని వివరించారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement