● ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి రవి
దుగ్గొండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు. మంలంలోని గిర్నిబావిలో నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శని వారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు మోర్తాల చందర్రావుతో కలిసి రవి మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రధాని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ ప్రజలపై భారాలు మోపుతోందని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూముల విక్రయాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటోందని చెప్పారు. మియాపూర్, కూకట్పల్లి, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోని పలు భూములకు లే అవుట్ చేసి విక్రయించిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు తీవ్రత పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టడంతోపాటు రైతులకు, వ్యవసాయ కూలీలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కుసుంబ బాబురావు, నాయకులు గోనె కుమారస్వామి, సింగతి సాంబయ్య, వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, అరుణ్‌కుమార్, కన్నం వెంకన్న, తాటికొండ రవి, సైదమ్మ, వంగల రాగసుధ, పానుగంటి నర్సయ్య, సింగతి మల్లికార్జున్, కొంరయ్య, తదితరులు పాల్గొన్నారు.


