నర్సంపేట : పట్టణంలోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి ఆలయంలో అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామాక్షి అన్న సత్రంలో కేఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నరహరి స్వాతి రాజేందర్‌రెడ్డి, కొంతం అరుణ శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బల కవిత అశోక్‌రెడ్డి, తమ కుమారుడు రేవంత్ జన్మదినం సందర్భంగా శారద యాదగిరి దంపతులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవ శంకర్ మాట్లాడారు. మాల వేసుకున్న స్వాముల సంఖ్య 1800లకు చేరుకోగా డిసెంబర్ 2వ తేదీ వరకు మాల వేసుకునే భక్తులు దర్శనం అనంతరం అన్న ప్రసాద వితరణ స్వీకరించాలని కోరారు. డిసెంబర్ 27 వరకు దివ్య పడి పూజలు, ఉత్తర నక్షత్ర పూజలు, పల్లివేట, పంబా ఆరటుకు, మాలదార స్వాములు, భక్తులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సైఫా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్‌రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, ప్రతినిధులు దోమకుంట్ల సదానందం, నందయ్య, మాదారపు చంద్రశేఖరం, శ్రీరాం ఈశ్వరయ్య, ఇరుకు కోటేశ్వరరావు, బండారుపల్లి చెంచారావు, శ్రీరాముల శంకరయ్య, శ్రీరాం కిరణ్, దొడ్డ వేణు, సైఫా రవి, శింగిరికొండ వేణుగోపాల్, సురేష్, మాదారపు రాజ్యలక్ష్మి, మేనేజర్ దేశి రాము, తదితరులు పాల్గొన్నారు.


