వరంగల్ రీజియన్‌లో మొత్తం 324 అద్దె బస్సుల్లో 146 బస్సుల గడువు మార్చితో ముగియనుంది. ఈ లోపు అద్దె బస్సుల రీప్లేస్‌మెంట్‌కు అనుమతి రావాల్సి ఉంటుంది. ఆర్టీసీ సొంత బస్సుల్లో చాలావాటిని కాలం చెల్లినా నడిపిస్తోంది. మరో వైపు సొంతగా బస్సులు సమకూర్చునే స్థితిలో లేనట్లుగా కనిపిస్తోంది. ఇవి స్క్రాప్‌కు వెళ్లనుండగా, మరోవైపు అద్దె బస్సులు తగ్గనుండడంతో సర్వీసుల కొరత నెలకొనుందని స్పష్టంగా కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో సంఖ్య పరంగా బస్సుల అవసరం పెరిగింది. ఈ క్రమంలో అద్దె బస్సుల కొనసాగింపు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం, యాజమాన్యం అద్దె బస్సుల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని యజమానులు ఎదురుచూస్తున్నారు. ఒక అద్దె బస్సు ద్వారా యజమానులు స్వయం ఉపాధి పొందడంతోపాటు మరో ఐదుగురికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు.


