ఏఆర్టీ క్లినిక్‌లలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఏఆర్టీ క్లినిక్‌లలో తనిఖీలు

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

ఏఆర్టీ క్లినిక్‌లలో తనిఖీలు వరంగల్‌ ఆర్‌ఓకు ఆర్టీఐ దరఖాస్తుల వెల్లువ నేడు నవోదయ ప్రవేశ పరీక్ష లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ఎయిడెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ (ఏఆర్టీ) క్లినిక్‌లను రాష్ట్ర స్థాయి ప్రత్యేక తనిఖీ అధికారి బి.ప్రేమ్‌కుమార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ తెలంగాణ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ హోదాలో ఆయన వివిధ క్లినిక్‌లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. జిల్లాలోని సద్గురు హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఒయాసిస్‌ ఫెర్టిలిటీ, నోవా హెల్త్‌ కేర్‌, ఫర్టీ నైన్‌ ఫెర్టిలిటీ సెంటర్‌, ఒరిజిన్‌ ఏఆర్టీ క్లినిక్‌, బేబీ లైఫ్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో డేటా అనాలసిస్‌ అధికారి సాయికుమార్‌, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డి, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, సీహెచ్‌ఓ మాధవరెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్‌, డేటా మేనేజర్‌ ప్రవీణ్‌, వినోద్‌, సందీప్‌ పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ (ఆర్టీఐ) దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన అధికారులతో పాటు ప్రస్తుత అధికారులు చేసిన దస్తావేజులపై, స్టాంప్స్‌పై, ప్రైవేట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పనితీరుపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడుగుతూ దరఖాస్తు చేసినట్లు సమాచారం. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు డీఐజీ కార్యాలయానికి సైతం ఆర్టీఐ దరఖాస్తులు అందినట్లు సమాచారం. కాగా, గతంలో ఎప్పుడు కూడా పూర్తి స్థాయి వివరాలను వెల్లడించలేదనే విమర్శలు ఉండగా, ప్రస్తుతం అందిన ఆర్టీఐ దరఖాస్తులపై అధికారులు ఎలా స్పందిస్తారోనన్న చర్చ కొనసాగుతోంది.

మామునూరు: ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే నవోదయ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ శనివారం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కలిపి మామునూరులో నవోదయ విద్యాలయం ఉంది. ఇందులో 80 సీట్లున్నాయి. ఇందుకుగాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,313 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే వారిలో బాలురు 3,159, బాలికలు 2,154 మంది (పట్టణ ప్రాంతం నుంచి 2,172 మంది, గ్రామీణ ప్రాంతం నుంచి 3,141 మంది) పరీక్షలు రాయనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది.

పకడ్బందీ ఏర్పాట్లు..

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులు శనివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని మామునూరు జవహర్‌ నవోదయ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ టి.రమేశ్‌ తెలిపారు. హాల్‌ టికెట్‌తోపాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ వెంట తెచ్చుకోవాలి.

కాశిబుగ్గ: వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 15 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మల్టీజోన్‌న్‌–1 పరిధి ఈ కళాశాలకు కాయ చికిత్స, శల్య, శాలక్య, ప్రసూతి తంత్ర అండ్‌ సీ్త్ర రోగ, ద్రవ్య గుణ, పంచకర్మ, రస శాస్త్ర బైశజ్య కల్పన, రచన శరీర్‌, క్రియా శరీర్‌, కౌమార భృత్య, రోగ నిధాన, అగధ తంత్ర అండ్‌ విధి ఆయుర్వేద, స్వస్థ వృత్త విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున, సంహిత సంస్కృత, సిద్ధాంత విభాగానికి రెండు లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈపోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement