మహాన్నపూజ.. కార్తీక సమారాధన
వేయిస్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీరుద్రేశ్వరస్వామిని ప్రళయ రుద్రుడిగా అలంకరించి మహాన్నపూజ నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు 11 కిలోల నెయ్యితో రుద్రాభిషేకం నిర్వహించారు. రఘుపతి రెడ్డి, మౌనిక దంపతుల సౌజన్యంతో మధ్యాహ్నం 51 కిలోల పెరుగన్నంతో మహాన్నపూజ చేశారు. భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు సామూహిక శ్రీసత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తున్నామని, భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. – హన్మకొండ కల్చరల్


