● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పెండింగ్ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అఽధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి ఆస్పత్రి పనులను ఆమె పరిశీలించారు. త్వరలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన ఉన్నందున ఆస్పత్రి నిర్మాణపు పనును నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అవుట్ పేషంట్ డిపార్ట్మెంట్లు, ఫార్మసీ, ఐసీయూ, ఎమర్జెన్సీ, ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్, ధర్మశాల, టాయిలెట్స్ తదితర పనులను సంబంఽధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిశోర్‌కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ అశ్విని, ఎల్అండ్టీ బాధ్యుడు శరవణ్ ఉన్నారు.
బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
న్యూశాయంపేట: వరంగల్‌ను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి కన్జ్వరేషన్స్ సమావేశం గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్య, ఆరోగ్యం భవిష్యత్‌పై బాల్య వివాహాలు ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాటిని అడ్డుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా అధికారులు రాజమణి, ప్రశాంత్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


