అర్హుల వివరాలు పక్కాగా నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల వివరాలు పక్కాగా నమోదు చేయాలి

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

సంగెం: ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించి అర్హుల వివరాలు సమగ్రంగా సేకరించాలని, ఎలాంటి తప్పులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ అన్నారు. కాట్రపల్లి, కుంటపల్లి, సంగెం గ్రామపంచాయతీల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీఓ రవీందర్‌, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు వర్కాల శ్రావణి, పెంతల సువర్ణ, పేర్ల లలిత, ఉప సర్పంచ్‌ ఆగపాటి రాజు, పంచాయతీ కార్యదర్శులు విజయ్‌, రెహానా, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ నమోదులో నిర్లక్ష్యం చేయద్దు..

ఖానాపురం: ఇందిరమ్మ బీమా పథకం లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని జెడ్పీ సీఈఓ వసంత అన్నారు. మండల కేంద్రంలో బీమా పథకం కేంద్రం, పశువైద్యశాల నిర్మిస్తున్న శానిటరీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతీ కుటుంబానికి బీమా ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఎంపీడీఓ వనపర్తి ఆఽధ్వైత, ఎంపీఓ సునీల్‌కుమార్‌, సర్పంచ్‌ దాసరి రమేష్‌, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement