కేయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కేయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

కేయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం – 8లోu

వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువ ఉంటుంది. రాత్రి సమయంలో చలితోపాటు పొగమంచు కురుస్తుంది.

సమసమాజ నిర్మాణం జరగాలి

సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం జరగాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌ అన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో 24వ స్నాతకోత్సవం రేపు (శనివారం) క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గురువారం యూనివర్సిటీలోని పరిపాలనాభవనం సెనెట్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్నాతకోత్సవ వివరాలు వెల్లడించారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌అండ్‌బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, లా, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మసీ, సైన్సెస్‌ విభాగాల్లో 2021–2022,2022–2023, 2023–2024, 2024–2025 విద్యాసంవత్సరాల్లోని అభ్యర్థులు 290 మందికి 408 బంగారు పతకాలు ప్రదానం చేస్తారని తెలిపారు. మొత్తం 91మంది అభ్యర్థులకు ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పట్టాలను రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా తన చేతులమీదుగా అందజేయనున్నారన్నారు. ముఖ్య అతిథిగా సైయంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమాల నిర్వహణకు 151మంది సభ్యులతో 12 కమిటీలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అందులో స్టీరింగ్‌ కమిటీ, రిసెప్షన్‌ కమిటీలతోపాటు వివిధ బాధ్యతలను నిర్వర్తించేలా కమిటీలున్నాయన్నారు. బంగారు పతకాలు, పట్టాలు అందుకునే అభ్యర్థులతోపాటు ప్రతీ అభ్యర్థి వెంట ఒకరికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు, అభ్యర్థులు తెల్లటి దుస్తులు ధరించి రావాల్సింటుందన్నారు. ఆహ్వానితులు, అధికారులు, సిబ్బంది నిర్దేశించిన ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, ఓఎస్‌డీ బి.వెంకట్రామ్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవానికి విద్యార్థి

సంఘాలు సహకరించాలి

ఈనెల 28న కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి విద్యార్థి సంఘాలు సహకరించాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని అకడమిక్‌ కమిటీ హాల్‌లో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ యూనివర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలని, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి, మెస్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం, ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ వెంకట్రామ్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ రాజేందర్‌, కేయూ పోలీస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

91 మందికి పీహెచ్‌డీ పట్టాలు,

290 మందికి 408 బంగారు పతకాలు

పట్టాలు పంపిణీ చేయనున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

తెల్లటి దుస్తులు ధరించి రావాలి..

వీసీ ప్రతాప్‌రెడ్డి వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement