ఓటరు నమోదుకు ప్రత్యేక తేదీలు | - | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు ప్రత్యేక తేదీలు

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

ఓటరు నమోదుకు ప్రత్యేక తేదీలు

హన్మకొండ అర్బన్‌: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా.. ఈనెల 28, 29, డిసెంబర్‌ 5, 6 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రత్యేక ప్రచార దినాల్లో జిల్లాలోని పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్దేశించిన ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఫారం–18, ఫారం–7, ఫారం–8 ద్వారా దరఖాస్తులు, అభ్యంతరాలు సమర్పించవచ్చని సూచించారు.

అనుమతుల్లేకుండా బోర్లు వేస్తే చర్యలు

నివాస గృహాలు, వ్యవసాయం మినహా వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల అవసరాల కోసం బోర్లు వేయాలంటే భూగర్భ జల శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో బోర్‌వెల్‌ అనుమతులు, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా భూగర్భ జల అధికారి శైలశ్రీ మల్లికాదేవి, అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రిగ్‌ వాహనాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

మాతా శిశు ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సేవల్లో వెనుకబడడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, మాతా శిశు ఆరోగ్య సేవలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణాలు, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, క్షయ వ్యాధి నిర్మూలన, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, వైద్యాధికారులు విజయలక్ష్మి, నరహరి, డాక్టర్‌ చంద్‌, మదన్‌మోహన్‌, మానస తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement