జిల్లాలో ఉదయం మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలిగా ఉంటుంది.
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధి ఉప్పల్, జమ్మికుంట రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బుధవారం కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా జమ్మికుంట ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు సరుకుల రవాణాకు సంధించి వ్యాగన్లలో సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ సౌకర్యాలు కల్పించే అంశంపై చర్చించారు. ఉప్పల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్ ట్రయల్ రన్‌లో ఉందని, త్వరలో పూర్తి స్థాయి సేవలందించాలన్నారు. జమ్మికుంటతో పాటు పెద్దపల్లి స్టేషన్లో మరిన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని జీఎంను మంత్రి కోరారు. శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం వారానికి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సంజయ్‌కుమార్ సూచించారు.
● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
దామెర: భూముల రీ సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్, సింగరాజుపల్లిలో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఈసందర్భంగా వెంకటాపూర్‌లో నిర్వహిస్తున్న రీ సర్వే పనుల ప్రక్రియను క్షేత్రస్ధాయిలో పరిశీలించి పలు సూచనలిచ్చారు. అనంతరం వెంకటాపూర్‌లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదును పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వీఓ భవనాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసనా నైపుణ్యాలు అడిగి తెలుకున్నారు. ఈసందర్భంగా ప్రాథమిక పాఠశాల గుదుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఏఈని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మంద జ్యోతివరలక్ష్మీదేవి, సర్పంచ్‌లు పంచగిరి రాజు, వడ్డెపల్లి చంద్రం, బొంకూరి రవియాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐ సతీశ్‌చంద్ర, ఎంఈఓ జుమ్మునాయక్, ఎంపీఓ రంగాచారి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, స్థానిక రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


