హన్మకొండ అర్బన్: ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామాన్ని ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. బుధవారం కలెక్టరేట్‌లో ‘కుడా’ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ శాఖల అధికా రులతో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సమావేశమయ్యారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో ఆహ్లాదకరమైన వా తావరణం కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, రహదారులు, మురుగు కాల్వ లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యు త్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్లు ఏర్పా టు చేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సామ్య నాయక్, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, తహసీ ల్దార్ జగన్మోహన్‌రెడ్డి, సర్పంచ్ సాంబ య్య, వివిధ శాఖల అధికారులున్నారు.


