● డీసీసీ అధ్యక్షుడు అయూబ్
వరంగల్ చౌరస్తా : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీసంవిధాన్ రక్షక్శ్రీ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పిలుపునిచ్చారు. మంగళవారం లక్ష్మిపురంలోని జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 కార్లలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. హైదరాబాద్ లిబర్టీ సర్కిల్లోని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు శ్రీసంవిధాన్ రక్షక్శ్రీ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి నియమితులై ఏడాది పూర్తి చేసుకున్నందున అయూబ్‌ను నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యక్షులు ఓర్సు తిరుపతి, చిలువేరు శ్రీనివాస్, రవీందర్ నాయక్, ర్నాటి పార్వతమ్మ, కొరివి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.


