● ఈసారి త్రిశూలం ఏర్పాటు చేసిన
అర్చకులు, ఆలయ సిబ్బంది
ఐనవోలు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవునిగుట్టగా ప్రసిద్ధి పొందిన ఊరగుట్టపై ఈసారి ఆలయ అధికారులు భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సంధ్యా సమయంలో ఊరగుట్టపై అఖండ జ్యోతిని ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి జ్యోతిని దర్శించుకున్నారు. అదేవిధంగా మల్లన్న ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈఓ కందుల సుధాకర్, ఎస్సై కొంక అశోక్, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్ శర్మ, దేవేందర్, సాయివరుణ్, సీనియర్ అసిస్టెంట్ అద్దంకి కిరణ్‌కుమార్, ఆలయ సిబ్బంది రాజు, శ్రీకాంత్, అభిరామ్ భక్తులు పాల్గొన్నారు.


