న్యూశాయంపేట: ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 213 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ (స్థానిక సంస్థలు) హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 52, హౌసింగ్ 35, జీడబ్ల్యూఎంసీ 33, డీఆర్‌డీఏకు 24 దరఖాస్తులు అందాయి. సంక్షేమశాఖ, 6, డీసీఎంఎస్‌ఓ 4, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ 3, వ్యవసాయశాఖ 3, విద్యాశాఖ 2, డీఎంహెచ్‌ఓ 2, ఎల్‌డీఎం 2, ఉపాధిశాఖ 1, పోలీస్‌శాఖ 1 దరఖాస్తు, ఇతర శాఖలకు 45 దరఖాస్తులు అందాయని అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రీవెన్స్‌లో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులు స్వీకరించిన
అదనపు కలెక్టర్ వైవీ గణేశ్


