● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ఆన్‌జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) ద్వారా ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ సూచించారు. వరంగల్‌లోని సత్యం కంప్యూటర్స్‌లో నిర్వహిస్తున్న ఓజేటీ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. నర్సంపేట ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్‌్స్ ఒకేషనల్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, థియరీ రూమ్, అటెండెన్‌్స్ కౌంటర్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, రోజువారీ అభ్యసన రికార్డులను పరిశీలించి అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఒకేషనల్ విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ తప్పనిసరని ఆయన తెలిపారు. శిక్షణ సమయంలో విద్యార్థులు పొందిన అనుభవాలు, నిర్వహించిన రికార్డుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్సెల్, ట్యాలీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, పీవోట్ టేబుల్స్, డీటీపీ వంటి అంశాల్లో నైపుణ్యం సాధించాలని ఆయన సూచించారు. కళాశాల అధ్యాపకులు ఝాన్సీ, భాగ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.


