● దరఖాస్తు ప్రక్రియ విజయవంతమైన తర్వాత ప్రింట్ తీసుకునే సమయంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మూడో దశలో ప్రింట్ తీసుకునేలోపే అప్పుడప్పుడు వెబ్‌సైట్ నిలిచిపోతోంది. మళ్లీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రెండోసారి ప్రింట్ తీసుకునే అవకాశం లేకపోవడంతో వార్డు అధికారుల వద్ద సమర్పించాల్సిన పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. విజయవంతమైన దరఖాస్తులకు తిరిగి ప్రింట్ తీసుకునే సదుపాయం కల్పించాలంటున్నారు.
● సర్కార్ ఇప్పటికే నామినీల వయస్సు ఎంతున్నా ఫర్వాలేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. రేషన్‌కార్డులో ఒక్కరే ఉన్నా ఇతర అర్హులైన వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. నామినీ వయోపరిమితిని పునఃపరిశీలించి, 59 ఏళ్లు దాటిన వారినీ నామినీలుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి.
● మైనర్లకు చట్టబద్ధ సంరక్షకుడి వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించాలి. ఇందిరమ్మ పోర్టల్‌పై ఉన్నతా ధికారులు సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తేనే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందంటున్నారు.


