పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

Nov 24 2026 1:12 AM | Updated on Nov 24 2026 1:12 AM

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి 42శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలి పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ 1.40 లక్షల ఇళ్ల పరిశీలన

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: పరకాల మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరకాల మున్సిపాలిటీ కమిషనర్‌ పోతరాజు పవన్‌, ఇతర అధికారులతో మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్ల పురోగతి, సిబ్బంది హాజరు, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పెండింగ్‌, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల ప్రాసెసింగ్‌ తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ మేనేజర్‌ రజిత, జేఏఓ అర్షద్‌, సాంకేతిక అధికారి రాము, టీపీఎస్‌ రాజ్‌కుమార్‌, ఆర్‌ఓ గిరిబాబు, సిస్టం మేనేజర్‌ సతీశ్‌ పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: రెండో వేతన సవరణ సంఘం నివేదికను తెప్పించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం ఐడీఓసీలోని టీజీఓ భవన్‌న్‌లో జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్‌కుమార్‌ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌న్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరరవ్వగా.. జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సమావేశాన్ని ప్రారంభించారు. పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, కోశాధికారి రాజేష్‌ కుమార్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్‌, రాష్ట్ర కార్యదర్శులు కిరణ్‌ కుమార్‌ గౌడ్‌, కోల్‌ రాజేష్‌, అస్నాల శ్రీనివాస్‌, అన్వర్‌ హుస్సేన్‌, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌రావు, తస్లీమా, మాధవరెడ్డి, డాక్టర్‌ రజినితోపాటు పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

హన్మకొండ: పంచారామాల దర్శనానికి టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పంచారామాలైన అమరావతిలోని అమరేశ్వరాలయం, భీమవరంలోని సోమేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరాలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం, సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వరాలయం దర్శించుకోనున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. చార్జి రూ.2,300గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. సూపర్‌ లగ్జరీ బస్సు ఈనెల 28న సాయంత్రం 7 గంటలకు హనుమకొండ నుంచి బయల్దేరుతుందని పంచారామాల దర్శనానంతరం తిరిగి 30న హనుమకొండకు చేరుకుంటారని పేర్కొన్నారు. అదేవిధంగా.. డిసెంబర్‌ 5న పంచరామాల దర్శనానికి మరో ప్రత్యేక సర్వీస్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముందుగానే టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరారు.

హన్మకొండ అర్బన్‌: రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా.. నిర్వహించిన ఇంటింటి సర్వేను సోమవారం హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. హనుమకొండ బస్టాండ్‌లోని తాత్కాలిక టీకాల కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర పరిశీలకుడు ఫణీందర్‌ జోషి సమక్షంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని చిన్నారులకు పోలియో చుక్కలు అందాయా లేదా? అని నిర్ధారించుకున్నారు. సోమవారం నిర్వహించిన ఇంటింటి సర్వేలో 1,40,004 ఇళ్లను పరిశీలించగా, 1,016 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement